ప్రపంచ సమస్యగా డ్రగ్ అడిక్షన్ : రెహమాన్

by Jakkula Samataha |   ( Updated:2023-12-14 15:08:34.0  )
ప్రపంచ సమస్యగా డ్రగ్ అడిక్షన్ : రెహమాన్
X

మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరంచుకుని స్పెషల్ వీడియో మెసేజ్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఒక్కసారి డ్రగ్స్‌కు అడిక్ట్ అయితే.. దాని నుంచి బయటకు రావడం కష్టమని హెచ్చరించారు. డ్రగ్ అడిక్షన్ వల్ల ఆరోగ్యకరమైన జీవితాలు నాశనం అవుతాయని.. ఘోరమైన నేరాలకు దారి తీస్తుందన్నారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా యువకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డ్రగ్ మాఫియా ప్రపంచ సమస్యగా మారిందని.. దీనికి వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

‘ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతున్నాం.. దీని నుంచి బయటకు రాగలం కానీ డ్రగ్స్‌కు అలవాటు పడితే మాత్రం బయటకు రాలేక జీవితం చిన్నాభిన్నం అవుతుంది. రాక్షస ఆలోచన పెరిగి.. చైల్డ్ అబ్యూజింగ్‌కు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి యంగ్ జనరేషన్‌ను కాపాడుకోవడం మన బాధ్యత’ అన్నారు రెహమాన్.

Advertisement

Next Story

Most Viewed