- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం
by srinivas |

X
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు రూ.50లక్షల కరోనా బీమా వర్తింప జేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం కార్మిక పరిషత్ నేతలు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును కలిసి బీమా కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ఒక్కరోజులోనే స్పందించిన యాజమాన్యం.. కార్మికులకు బీమా వర్తింప జేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మృతిచెందిన 36మంది కార్మికులకు ఈ బీమా వర్తింపజేసేందుకు సైతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివరాలన్నింటినీ ఈనెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆర్ఎంలకు ఎండీ కృష్ణబాబు సూచన చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని సైతం కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు రావడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story