- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదంపై నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఇరురాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేనని, ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాలున్నాయని కేంద్రానికి సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి చేసిన వినతి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ పంపారు. అపెక్స్ కౌన్సిల్ నిర్వహించే తేదీని త్వరలోనే తెలుపుతామని లేఖలో పేర్కొన్నారు.
Next Story