ఆప్కో క్లాత్.. రోజూ 40 లక్షల మాస్కులు

by srinivas |
ఆప్కో క్లాత్.. రోజూ 40 లక్షల మాస్కులు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల పంపిణీకి ప్రణాళిక రచించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరంతో పాటు ముఖానికి మాస్క్ ధరించడం, చేతులు నిత్యం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మెడికల్ షాపుల్లో మాస్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయి. ఎంత ధర చెల్లించి కొందామన్నా మాస్కులు అందుబాటులో లేవు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల మాస్కు అవసరాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు అందజేయాలని నిర్ణయించింది. దీంతో ఈ బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) కి బాధ్యతలు అప్పగించింది. సెర్ప్‌లో సుమారు 9 లక్షల సంఘాల్లో కోటి మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో కొంతమందికి నాబార్డ్ నిధులతో టైలరింగ్ శిక్షణ ఇచ్చి, మిషిన్లు పంపిణీ చేశారు. వీరందర్నీ ఇప్పుడు వినియోగించుకోనున్నారు.

జిల్లాలోని ఆ సంఘ సభ్యులకు ఆప్కో ద్వారా సేకరించిన నీలం రంగు కాటన్ వస్త్రాన్ని సమకూర్చనున్నారు. వీరంతా జిల్లాకు 3 లక్షల మాస్కులు సరఫరా చేయాల్సిఉంటుంది. ఒక్కోమాస్క్‌కు 3 రూపాయలు చెల్లించనున్నారు. ప్రతి రోజూ 40 లక్షల మాస్కులు తయారవుతాయని సెర్ప్ అధికారులు అంచనా వేస్తున్నారు.

tags:coronavirus, maske, serp, ap, nabard

Advertisement

Next Story