- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఎఫెక్ట్… వాచ్‌మెన్ ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా సమస్త మానవాళి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు చాలా రకాల సమస్యలు చవిచూడాల్సి వచ్చింది. దీని మూలంగా అనేక మంది ఇప్పటికే మరణించారు కూడా. తాజాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధి పద్మానగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…
పద్మానగర్ ఫేస్-2లో ఓ అపార్ట్మెంట్‌లో రాంబాబు(60) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా, లాక్‌డౌన్ విధించారు. దీంతో ఆయన ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో అక్కడక్కడా అవసరాల కోసం అప్పులు చేశాడు.
కరోనా కారణంగా సరైన ఉపాధిలేక అప్పలు పెరిగిపోయాయి. దీనికితోడు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న రాంబాబు, తీవ్ర మనస్థాపంతో బుధవారం తెల్లవారుజామున బాత్రూంలోని రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రకి తరలించారు.