- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యారీ ఓవర్ జలాలపై మీరే తేల్చుకోండి !
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా బేసిన్‌లో క్యారీ ఓవర్ జలాలపై ఏపీ, తెలంగాణే తేల్చుకోవాలని కేంద్ర జలశక్తి లేఖ రాసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో వివాదం తేలకుండా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి మెంబర్ సెక్రెటరీ రాజ్‌పురే రాష్ట్రానికి లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లో నీటి కేటాయింపుల ప్రకారం గత ఏడాది వినియోగించకుండా ఉన్న దాదాపు 50టీఎంసీల నీరు ఈసారి సాగర్ నుంచి వాడుకునేందుకు తెలంగాణ జూన్‌లో లేఖ రాసింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ… జల సంఘాన్ని, ఏపీని అభిప్రాయం కోరింది. ఏపీ దీన్ని వ్యతిరేకిస్తూ అభిప్రాయం తెలిపింది. దీంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమని, రెండు రాష్ట్రాలే తేల్చుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌లో కూడా ఈ అంశం పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Next Story