టీడీపీలో కలకలం.. వారికి అచ్చెన్నాయుడు వార్నింగ్

by Anukaran |
టీడీపీలో కలకలం.. వారికి అచ్చెన్నాయుడు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీని గందరగోళానికి గురి చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా కొందరు వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలర్ట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ దౌర్జన్యాలపై ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed