అచ్చెన్నాయుడు అరెస్ట్.. విజయసాయిరెడ్డి ఓదార్పు

by srinivas |   ( Updated:2021-02-01 21:54:51.0  )
అచ్చెన్నాయుడు అరెస్ట్.. విజయసాయిరెడ్డి ఓదార్పు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించారని అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోటబొమ్మాళి పీఎస్కు తరలించారు. మరోవైపు నిమ్మాడలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించనున్నారు. వైసీపీ తరుపున సర్పంచ్ అభ్యర్థి బరిలోకి దిగిన అప్పన్నను అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు బెదిరించారని అందుకే వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించేందుకు అక్కడికి వెళుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed