భద్రాద్రి రామయ్యని దర్శించుకున్న ఏపీ స్పీకర్, సుక్మా కలెక్టర్

by Sridhar Babu |
AP Speaker Tammineni Sitaram
X

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు దేవస్థానం ఈవో శివాజీ, అర్చకులు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి స్పీకర్ సీతారాం, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్ రామయ్యను దర్శించుకున్నారు. అధికారులు, పురోహితులు ఆయనకు స్వాగతం పలికారు. తదుపరి స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sukma Collector Vineet Nandan

Advertisement
Next Story

Most Viewed