- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే రాజ్యసభ ఎన్నికలు.. టీడీపీ నిలబడేనా?
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11, తెలంగాణకు 7 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు, ఎంఏ ఖాన్, టీ. సబ్బరామరెడ్డి, తోట సీతారామలక్ష్మి స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి మార్చి 26నే పోలింగ్ జరగాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తాజాగా, లాక్‌డౌన్ సడలింపులతో శుక్రవారం ఎన్నికలు నిర్వహించనుంది.
ఇందుకు సంబంధించిన ఎన్ని ఏర్పాట్లూ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. బరిలో వైసీపీ నుంచి పరిమళ్ నత్వానీ, ఆయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండగా, టీడీపీకి రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేనప్పటికీ వర్ల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ ఒక్క స్థానాన్నైనా దక్కించుకుంటుందా లేదా అన్నదానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పొరపాట్లకు పాల్పడకుండా ఉండేందుకు పార్టీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాక్ పోలింగ్ నిర్వహించగా, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటింగ్‌పై సూచనలు చేశారు.