- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిమ్మగడ్డ సెలవు వెనుక అసలు రహస్యమేంటి..?
దిశ, ఏపీ బ్యూరో: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్సెలవు పెట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఆయన కుటుంబంతో కలిసి అరుణాచల్ప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. అందుకోసం 16 నుంచి 21 దాకా సెలవు పెట్టారు. ఆయన పదవీకాలం మార్చి 31తో ముగుస్తుంది. ఇది ఇలా ఉంటే మరి మా ఎన్నికల సంగతేంటని ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లబోదిబోమంటున్నారు. అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఏడాదిగా జనంలో ఉండేందుకు కరోనా సమయంలో బోలెడు ఖర్చుపెట్టి ప్రజలను ఆదుకున్నారు. ఆగిపోయిన చోట నుంచే ఎన్నికలు నిర్వహిస్తారని వీళ్లంతా ఆశలు పెట్టుకున్నారు. నాడు ఎస్‌ఈసీనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, నామినేషన్లను వేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.
ఈ ఎన్నికలపై న్యాయస్థానాల్లో ఫిర్యాదులకూ ఇదే సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆగిపోయిన చోట నుంచే ఎన్నికలను ప్రారంభించాలంటే ఎస్‌ఈసీకి ఈ ఇబ్బందులున్నాయి. అందుకే ఆయన సెలవు పెట్టి టూర్కు వెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్నికలకు పోవాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా మరిన్ని జిల్లా పరిషత్‌లు వస్తే మరింత మందికి పదవులు ఇవ్వొచ్చని భావిస్తోంది. ఇదే ప్రభుత్వ నిర్ణయమైతే స్థానాలు పెరుగుతాయి. రిజర్వేషన్లు మారిపోతాయి. మళ్లీ కొత్త నోటిఫికేషన్‌తో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అటు ఎన్నికల సంఘానికి, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా నిమ్మగడ్డ సెలవు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది