తెలిసి చేశాడనుకోవాలా..తెలియక చేశాడనుకోవాలా!

by  |
తెలిసి చేశాడనుకోవాలా..తెలియక చేశాడనుకోవాలా!
X

దిశ, ఏపీబ్యూరో: సామాజిక మాద్యమాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అలాంటి పోస్టులను ఇతరులకు షేర్ చేసినా వారిపై చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రజలకు ఎన్నోమార్లు అవగాహన కూడా కల్పించారు. చదువుకోని వారు చేస్తే ఎదో తెలియక చేశాడు అనుకోవచ్చు కానీ, ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి అన్ని తెలిసినా కూడా షేర్ చేశాడు. దీనిని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టేలా ఉన్న పోస్టును ఇతరులకు షేర్ చేసిన ఉద్యోగిపై వేటు వేశారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంవీ విద్యాసాగర్ వాట్సాప్‌లో తనకు వచ్చిన ఓ పోస్టును మరొకరికి షేర్ చేశారు. అదే ఆయన కొంపముంచింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌లు విద్యాసాగర్‌ను నస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనల కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. అతని ఫోన్‌ను సైతం సైబర్ క్రైం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయంపై సునీల్ కుమార్ మాట్లాడుతూ..వాట్సాప్ గ్రూపుల్లో విద్యాసాగర్ ప్రభుత్వ వ్యతిరేక పోస్టు చేశారని, సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ విమర్శలు చేశారని వివరించారు. దీనిపై ఫిర్యాదులు అందగా, విచారణలో అది నిజమేనని తేలడంతో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed