- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలు అంత్యక్రియలకు వెళ్లిన ఏపీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు శనివారం చెన్నైలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. మంత్రి బాలు భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం.. కాబట్టి.. ఆయనకు తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
మంత్రి అనిల్‌తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్‌హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్‌హౌస్‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.