డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలి : హైకోర్టు

by srinivas |
డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలి : హైకోర్టు
X

దిశ, ఏపీబ్యూరో : కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతం సవాంగ్, ఐజీ మహేశ్ చంద్ర లడ్డా వ్యక్తిగతంగా హాజరు కావాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఎస్సై రామారావుకు సీఐ పదోన్నతి ప్యానల్లో స్థానం కల్పించాలని ధర్మాసనం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయట్లేదంటూ రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

తాజాగా మరోసారి పిటిషన్ విచారణకు రాగా ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు తరఫున న్యాయవాది విచారణకు హాజరయ్యారు. నోటీసులు అందుకున్నా హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు న్యాయవాదులను నియమించుకోలేదు. స్వయంగా కూడా హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆ అధికారుల వ్యక్తిగత హజరుకు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed