నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి హైకోర్టులో కీలక ఉద్యోగాలు

by Anukaran |   ( Updated:2021-09-10 02:11:29.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి హైకోర్టులో కీలక ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయెస్ట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 174 పోస్టులు ఉండగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. కాపీయిస్ట్ పోస్టుకు టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ నైపుణ్యం కలిగిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2021 సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Advertisement

Next Story