స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టు ఆగ్రహం

by srinivas |
highcourt
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల చేయడం సరైనది కాదని పేర్కొంది. న్యాయస్థానాలపై మీడియా, సోషల్‌ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని.. బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్పీకర్‌ అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్‌ వ్యాఖ్యానించారని కోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed