గ్రామ వాలంటీర్లకు సర్కార్ ఝలక్ 

by srinivas |
గ్రామ వాలంటీర్లకు సర్కార్ ఝలక్ 
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను నిత్యం పర్యవేక్షించడం ద్వారా పటిష్టంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీతో పాటు వారి హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా గురువారం ఆదేశాలు జారీ చేసింది. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ (బయో మెట్రిక్) అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది. ఆరో రోజు వరకు హాజరుకాకుంటే ఏడో రోజున పోస్టు ఖాళీ అయినట్లు నోటిఫై చేయాలని స్పష్టం చేసింది.

నోటిఫై చేసిన నాటి నుంచి 14 రోజుల్లోగా ఖాళీలను భర్తీ చేయాలి అని నిర్ణయించింది. వలంటీర్ పోస్టులు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే భర్తీకి సంబంధిత జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. పోస్టుల భర్తీకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. గ్రామ, వార్డు పరిధిలో మెజారిటీ కమ్యూనిటికీ చెందిన వ్యక్తులను రిజర్వేషన్లు పాటిస్తూ భర్తీ చేయాలని పేర్కొంది. దీనివల్ల వలంటీర్లు, ఆ పరిధిలోని కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Next Story