- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగుల ఉపాధికి వాహనాలు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదల ఇంటికే రేషన్ బియ్యం అందించేందుకు 9260 వాహనాలు కొనుగోలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువతకు ఈ వాహనాలు ఇస్తారు. వాహనాల కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందించనుంది.
రుణం తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. ఆరు సంవత్సరాలపాటు రుణం తీర్చిన అనంతరం లబ్దిదారుల పేరుతో వాహనం అందిస్తారు. వాహనాల సబ్సిడి కోసం రూ. 331 కోట్లు అప్పు తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చారు. బియ్యం డోర్ డెలివరీ కి ప్రతి ఏడాది రూ. 776. 45 కోట్లు మంజూరు చేయనున్నారు.
Advertisement
Next Story