కొత్త ఎస్ఈసీ కోసం జగన్ సర్కార్ కసరత్తు.. రేసులో ఆ ముగ్గురు

by srinivas |
ap SEC Logo
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ముగ్గురు అధికారుల పేర్లను కొత్త ఎస్ఈసీగా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ హరిచందన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ జాబితాలో తాజా మాజీ సీఎస్‌ నీలం సాహ్నీతో పాటు ప్రస్తుత జగన్‌ సలహాదారుల్లో ఒకరైన శామ్యూల్, మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు.

సీనియార్టీ ప్రకారం చూస్తే ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌, నీలం సాహ్నీ రేసులో ఉంటారు. ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని గవర్నర్‌ తదుపరి ఎస్ఈసీగా నియమించే అవకాశం ఉంది. వారం రోజుల్లో నిమ్మగడ్డ రిటైర్ కానున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో వీరిపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీరంతా మాజీ ఐఏఎస్‌లు కావడం, ఇందులో ఇద్దరు ప్రస్తుతం సీఎం జగన్‌కు సలహాదారులుగా ఉండటం, మరో అధికారి కూడా వైఎస్ కుటుంబానికి విధేయుడే కావడంతో ఈ జాబితా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Next Story