‘నీచమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ’

by srinivas |   ( Updated:2021-01-12 04:49:25.0  )
‘నీచమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ’
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ శక్తుల ప్రోద్బలంతోనే ఏపీలోని గుడిలపై అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షలాది మందికి చేస్తున్న మేలు ప్రజలకు చేరకుండా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే అపోహాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. నీచమైన రాజకీయాలకు పేరు పొందిన ప్రతి పక్ష పార్టీ తెలుగుదేశం, ఇతర పార్టీల ఏజెంట్లు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా సిట్‌తో విచారణ చేయిస్తోందన్నారు. ఇది ఇలా ఉంటే అమ్మ ఒడి పథకాన్ని ఓర్వలేకనే ప్రతి పక్షం మరో కుట్రకు తెరలేపిందని సజ్జల విమర్శించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహారం కూడా ఇందులో భాగంగానే తీసుకొచ్చారన్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇటువంటి వారిని హైలెట్ చేస్తోందన్నారు. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీ అనుకూలంగా ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed