- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఎంసెట్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు. జూన్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.5000 అపరాధ రుసుముతో జూలై 7 వరకు, రూ. 10వేలు అపరాధ రుసుముతో జూలై 14 వరకు, రూ.15 వేలు లేట్ ఫీజుతో జూలై 22 వరకు, రూ. 20 వేలు అపరాధ రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కరోనా నేపథ్యంలోనే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఒక్కో విద్యార్థి మధ్య 5 మీటర్ల భౌతిక దూరం ఉండేలా సీటింగ్ సెట్ చేస్తామని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేస్తామని కార్యదర్శి ఒమర్ జలీల్ స్పష్టం చేశారు.