ఏపీ కరోనా అప్‌డేట్‌: తగ్గుతోన్న కరోనా కేసులు

by srinivas |   ( Updated:2021-07-27 08:03:34.0  )
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 61,298 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,540 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,55,037కి చేరింది. నిన్న ఒక్క రోజు వ్యవధిలో 19 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,292కి చేరింది. అదే సమయంలో 2,265 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,20,780కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,965 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,42, 53, 931 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story