ఆయనకు ఎలాంటి సహాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం.. జగన్

by srinivas |   ( Updated:2021-11-24 06:54:24.0  )
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల సత్యనారాయణ అనారోగ్యంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావుకు సీఎం జగన్‌ ఫోన్ చేశారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అధైర్యపడొద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story