డబ్బులను ఎలా ఖర్చు చేయాలో నేర్చుకున్న కోతులు.. వ్యసనాలకు, వ్యభిచారానికీ ఉపయోగం!

by Aamani |
డబ్బులను ఎలా ఖర్చు చేయాలో నేర్చుకున్న కోతులు.. వ్యసనాలకు, వ్యభిచారానికీ ఉపయోగం!
X

దిశ,వెబ్ డెస్క్ : కోతులు మనం చేసే పనిని గ్రహించి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. వాటి అల్లరికి అడ్డుఅదుపు అంటూ ఉండదు.అయితే మనం చుసే పసులల్లో ఒక ముఖ్యమైన పనిని కూడా అలవాటు చేసుకుంటుందని ఒక పరిశోధనలో వెల్లడైంది.

డబ్బు అనేది మానవ సమాజంలో ఒక ముఖ్యమైన అంశం. కానీ, ఈ ఆర్థిక వ్యవస్థను కోతులు కూడా అర్థం చేసుకోగలవా? యేల్ విశ్వవిద్యాలయంలో (Yale University) ఆర్థిక శాస్త్రవేత్త కీత్ చెన్, మనస్తత్వవేత్త లారీ శాంటోస్ నిర్వహించిన ఒక ప్రయోగం (experiment)ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అవును, కోతులు కూడా డబ్బును ఉపయోగించగలవు, అది కూడా కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన రీతిలో!

ప్రయోగం ఎలా జరిగింది..?

ఈ ప్రయోగంలో కాపుచిన్ కోతులకు లోహ డిస్క్‌లను ఒక రకమైన "డబ్బు"గా పరిచయం చేశారు. ఈ టోకెన్‌లతో (Token)కోతులు ఆహారం,ద్రాక్ష లేదా జెల్లో క్యూబ్‌ల వంటి రుచికరమైన పదార్థాలను,కొనుగోలు చేయగలవని నేర్పించారు. కొద్ది సమయంలోనే కోతులు ఈ వ్యవస్థను అర్థం చేసుకుని, టోకెన్‌లను ఉపయోగించి ఆహారం కోసం లావాదేవీలు చేయడం ప్రారంభించాయి.

ఆశ్చర్యకరమైన ప్రవర్తనలు..!

కానీ ఈ ప్రయోగం ఇక్కడితో ఆగలేదు. కోతులు కేవలం ఆహారం కోసం టోకెన్‌లను ఉపయోగించడం మాత్రమే కాకుండా, మానవుల్లాంటి కొన్ని వింత ప్రవర్తనలను కూడా ప్రదర్శించాయి. ఒక సందర్భంలో, ఒక కోతి తన టోకెన్‌ను (Token)మరొక కోతికి ఇచ్చి లైంగిక సేవలను పొందిందని పరిశోధకులు గమనించారు. ఇంకొక సందర్భంలో, కొన్ని కోతులు టోకెన్‌లను దొంగిలించడం లేదా సేకరించడం వంటి చర్యలకు పాల్పడ్డాయి. ఈ ప్రవర్తనలు వ్యభిచారం,దొంగతనం వంటి సామాజిక అంశాలను సూచించాయి.

అంతేకాదు, కోతులు జూదం ఆడినట్లు కూడా కనిపించింది. విభిన్న రివార్డ్‌లను ఇచ్చే వ్యాపారుల మధ్య ఎంచుకోవడం ద్వారా, అవి సంభావ్యత (ప్రాబబిలిటీ) (Probability)నిర్ణయాధికారం గురించి కూడా ఒక స్థాయి అవగాహనను చూపించాయి.

ఈ ప్రయోగం ఏం చెబుతోంది..?

ఈ ప్రయోగం ఆర్థిక వ్యవహారాలు,వాటి సంబంధిత ప్రవర్తనలు కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదని, ప్రాథమిక స్థాయిలో జంతువుల్లోనూ ఉండవచ్చని సూచిస్తుంది. డబ్బు విలువను అర్థం చేసుకోవడం, వ్యాపారం చేయడం, లాభం కోసం రిస్క్ (Risk)తీసుకోవడం వంటివి మానవులకు మాత్రమే సొంతమైనవి కావని, ఇవి సహజ స్వభావం లో భాగంగా ఉండవచ్చని ఈ కోతులు నిరూపించాయి.

కీత్ చెన్, లారీ శాంటోస్ నిర్వహించిన ఈ ప్రయోగం కేవలం ఒక ఆసక్తికరమైన అధ్యయనం మాత్రమే కాదు. ఇది మన ఆర్థిక వ్యవస్థలు, సామాజిక ప్రవర్తనల మూలాలను ప్రశ్నించేలా చేస్తుంది. కోతులు డబ్బును ఎలా ఉపయోగించాయో చూస్తే, ఆర్థిక విలువలు నైతికత గురించి మనం మరింత ఆలోచించాల్సిన అవసరం ఉందని అర్ధమవుతుంది. ఈ చిన్న జీవులు మనకు చూపిన ఈ పాఠం నిజంగా ఆశ్చర్యకరం,ఆలోచనాత్మకం.

Next Story

Most Viewed