ఎన్టీఆర్ ధరించిన షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ట్వీట్

by Hamsa |
ఎన్టీఆర్ ధరించిన షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఎన్టీఆర్(NTR) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘దేవర’ మూవీతో హిట్ అందుకున్న ఆయన అదే ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ మూవీతో పాటు దేవర-2(Devara - 2), అలాగే కోలీవుడ్ డైరెక్టర్‌తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆయన ధరించి షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే సింపుల్‌గా పువ్వుల డిజైన్ కలిగి ఉన్న ఆ షర్ట్ ఏకంగా రూ.85,000 అని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వామ్మో ఆ ఒక్క షర్ట్‌కే అంత ధర అయితే ప్యాంట్, షూట్, వాచ్, గాగుల్స్ అన్ని కలిపి ఎంతనో అని చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed