జగన్ పోలవరం సందర్శన… విజువల్స్ వీడియో

by Anukaran |   ( Updated:2024-06-02 15:03:11.0  )
జగన్ పోలవరం సందర్శన… విజువల్స్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ సందర్శించారు. ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులను పరిశీలిస్తున్నారు. అంతకు ముందు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు.

కాగా, ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు జగన్‌కు వివరిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలవరం విజువల్స్ కింద వీడియోలో చూడవచ్చు.

Next Story

Most Viewed