పొరుగు రాష్ట్రాల్లోని వారు అక్కడే ఉండండి : సీఎం జగన్

by srinivas |   ( Updated:2020-05-03 06:59:31.0  )
పొరుగు రాష్ట్రాల్లోని వారు అక్కడే ఉండండి : సీఎం జగన్
X

దిశ, అమరావతి: పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రాకు చెందిన వారు అక్కడే ఉండాలని, ప్రయాణం చేయడం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి అక్కడే సురక్షితంగా ఉండటం మంచిదని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దు ప్రాంతాలకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం అభ్యర్థించింది. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో ఏపీ ప్రజల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి గురించి సమావేశంలో చర్చించారు.

అదేవిధంగా, కేంద్ర హోమ్‌శాఖ మార్గదర్శకాలను అనుసరించి..వల కూలీలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వేలల్లో ఉన్న కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన సదుపాయాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు.అందుకే మిగిలినవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఎక్కడివారు అక్కడే ఉండటం అత్యంత శ్రేయస్కరమని సీఎం జగన్ తెలిపారు. కరోనాతో పోరాటంలో ప్రజలు చూపిస్తున్న స్పూర్తీ ప్రశంసనీయంగా ఉందని, ప్రభుత్వ సూచనలను పాటించి వీలైనంత తొందరగా కరోనాను రాష్ట్రంలో లేకుండా ఉండేందుకు సహకరించాలని కోరారు.

Tags: cm, cm jagan, people dont come at border, ys jagan mohan reddy, coronavirus, covi-19

Advertisement

Next Story

Most Viewed