- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
34వేల పాఠశాలల అభివృద్ధికి ఏపీ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించింది. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాడు-నేడు కింద రాష్ట్రంలో 34వేల ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిన అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రాజెక్టులలో స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు సంబంధించి అంశంపైనా కేబినెట్ చర్చించింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
1. నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించేందుకు ఆమోదం.
2. రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం
3. వైఎస్సార్ నేతన్న నేస్తంకు రూ.200 కోట్లు కేటాయింపు
4. 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు ఈనెల 24న చెల్లింపులు
5. ఈ నెల 14న జగనన్న విద్యాకానుక పంపిణీ
6. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు ఆమోదం
7. రాజమహేంద్రవరం అర్బర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు
8. కాకినాడ డెవలప్‌మెంట్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారటీ