ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై..

by Anukaran |
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన కొత్త జిల్లాలకు సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంటు నియోజకవర్గాన్ని సరిహద్దులుగా తీసుకుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి.

Advertisement

Next Story