డీజీపీ విమర్శలు.. నిరసనకు దిగిన బీజేపీ నేతలు

by srinivas |   ( Updated:2021-01-20 22:43:37.0  )
డీజీపీ విమర్శలు.. నిరసనకు దిగిన బీజేపీ నేతలు
X

దిశ,వెబ్‌డెస్క్: విగ్రహాల విధ్వంసంలో బీజేపీ నేతల పాత్ర ఉందంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ నేతలు జనవరి 16న డీజీపీకి విగ్రహాల ధ్వంసం కేసులో గందరగోళ ప్రకటన చేశారని.. 20 తేదీలోగా వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు డీజీపీ స్పందించకపోవడంతో.. డీజీపీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగేందుకు బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలు విజయవాడ చేరుకున్నారు. అయితే బీజేపీ నేతలు ధర్నాకు దిగుతున్నారనే సమాచారంతో పోలీసులు..,బీజేపీ ముఖ్యనేతల్ని ముందస్తుగానే అరెస్ట్‌లు చేసేందుకు సిద్ధమయ్యారు.

Next Story

Most Viewed