ఆంధ్రా రైతులంటే కేసీఆర్‌కు కడుపుమంట… బీజేపీ నేత విష్ణువ‌ర్ధన్‌రెడ్డి

by srinivas |   ( Updated:2021-07-03 02:50:24.0  )
ఆంధ్రా రైతులంటే కేసీఆర్‌కు కడుపుమంట… బీజేపీ నేత విష్ణువ‌ర్ధన్‌రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెలకొన్న జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ఆంధ్రా రైతులు అంటే కడుపమంట అని ఘాటుగా విమర్శించారు. ఆంధ్రా రైతులపై కడుపు మంటతోనే ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి వదులుతున్న చరిత్ర మీకు మాత్రమే దక్కుతుంది కేసీఆర్ దొర అంటూ ట్విటర్ వేదికగా విమర్శించారు. పులిచింతలలో తెలంగాణ జెన్‌కో అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నందువల్ల 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలాల్సి వస్తోందని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పంపుతున్నారని మండిపడ్డారు.

‘కేసీఆర్ తన చేష్టలతో ఆంధ్రా రైతులకే కాదని యావత్ రైతులందరికీ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశ చరిత్రలో కేసీఆర్ రైతు ద్రోహిగా మిగిలిపోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజం హిట్లర్‌ను చూడలేదు కానీ హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్‌ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ మీ అనైతిక అహంకార, పిచ్చి చర్యలను మరచిపోదని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని విష్ణువర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed