- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే అనేకసార్లు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొంతమేర వైరస్ ఉధృతి తగ్గడంతో సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురికి సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు పనితీరు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారపక్షం సభ ద్వారా ప్రజలకు వివరించనుంది. అంతేగాకుండా నివర్ తుఫాన్ ప్రభావంపై కూడా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు.