- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు.. రాజ్‌భవన్ నుంచే..?
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో కేవలం రెండు రోజులపాటే బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు తెలుస్తోంది. నేడు ఉదయం 10గంటలకు శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా గంటసేపు ప్రసంగిస్తారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ఆరంభమవుతాయి. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. ఇది ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దేశ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అనివార్యమైన పరిస్థితుల్లోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వ మర్గదర్శకాల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసన సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.