వీఐపీలకు ఏదైనా శేషాద్రి చేతుల మీదుగానే..

by srinivas |
Seshadri
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమలకు ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు వెంకన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన వీఐపీలు ప్రత్యేకించి డాలర్ శేషాద్రి ఆశీస్సులు పొందేందుకు ఆసక్తి చూపుతారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రముఖులకు శేషాద్రి చేతుల మీదుగానే రాచమర్యాదలు జరుగుతుండేవి. ఆయనకు చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి మోడీ వరకు.. అంబానీలు, అదానీలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతులు ఇలా వీఐపీలు, వీవీఐపీలు ఎవరొచ్చినా డాలర్ శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయించేవారు. బహుభాషా కోవిదుడు కావడంతో అన్ని ప్రాంతాల వీఐపీలతో డాలర్ శేషాద్రి ముచ్చటించేవారు. స్వామివారి దర్శనాల్లో వారికి స్వామివారి విశిష్టతను సైతం తెలియజేశారు. అలాగే ఆయా భాషల్లో పట్టు ఉండటంతో అందరికీ శ్రీవారి విశిష్టతను తెలియజేసేవారు.

Advertisement

Next Story

Most Viewed