షూటింగ్స్‌కు అనుష్క బై బై..

by Anukaran |   ( Updated:2020-11-28 06:09:20.0  )
షూటింగ్స్‌కు అనుష్క బై బై..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒక్కసారి లైమ్ లైట్‌కు అలవాటు పడితే దూరం కావడం చాలా కష్టం. అదొక వ్యసనం అంటుంటారు సెలెబ్రిటీలు. బతికున్నంత కాలం అక్కడే ఉండాలని.. అక్కడే పని చేయాలని.. అదే మా పని అని చెప్తుంటారు. ఏదో కొంచెం గ్యాప్ ఇస్తారు తప్పితే పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోవాలని అనుకోరు. ఆ ఊహ కూడా వారికి ఇష్టముండదని చెప్తుంటారు. హీరోలు బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎంచుకునేందుకు గ్యాప్ తీసుకుంటే.. హీరోయిన్స్ పెళ్లి, పిల్లలు అంటూ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది.

ఈ క్రమంలో త్వరలో తల్లి కాబోతున్న అనుష్క శర్మ కూడా ఫిల్మింగ్ గ్యాప్ ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా తనే ప్రకటించింది. 2018 నుంచే సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. తనతో డీల్ కుదుర్చుకున్న కంపెనీల యాడ్ షూటింగ్స్‌కు మాత్రం హాజరవుతోంది. ఈ క్రమంలోనే గత వారం రోజుల పాటు బేబి బంప్‌తోనే షూటింగ్‌లో పాల్గొన్న అనుష్క.. బిడ్డ పుట్టిన తర్వాతే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని ప్రకటించింది. ఇంట్లో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని.. బేబి, హోమ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయగలననే నమ్మకం వచ్చాక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తానని తెలిపింది. కాగా అనుష్కకు డాక్టర్లు జనవరిలో డెలివరీ డేట్ ఇవ్వగా.. తనను దగ్గరుండి చూసుకునేందుకు పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు కోహ్లీ. ఈ మేరకు ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్ ముగియగానే ఇండియాకు తిరిగిరానున్నాడు.

Advertisement

Next Story