- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇర్ఫాన్ ఖాన్ కుమారుడిని లాంచ్ చేస్తున్న అనుష్క
దిశ, సినిమా: హీరోయిన్ అనుష్క శర్మ హోమ్ ప్రొడక్షన్ హౌజ్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ మరోసారి నెట్‌ఫ్లిక్స్‌తో కొలాబొరేట్ అయింది. లాస్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ కాంబినేషన్‌లో ‘బుల్‌బుల్’ ద్వారా హిట్ అందుకున్న అనుష్క ఈ సారి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘కాలా’ ద్వారా మరోసారి ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా లేట్ లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండగా..తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.
తన లాంచింగ్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కాలా’ సెట్స్ నుంచి వీడియో షేర్ చేసిన బాబిల్ తను ‘లాంచ్ అవ్వడం’ అనే పదం కొంచెం అనుమానంగా ఉందన్నాడు. ప్రేక్షకులు కూడా సినిమా చూసేటప్పుడు తమ సీట్లను లాంచ్ చేయక తప్పదని, అంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందని చెప్పాడు. ‘కాలా’ చిత్రం.. ‘ఓ తల్లి మనసులో చోటు సంపాదించేందుకు కూతురు పడే తపన’ అని, త్వరలో ‘కాలా’ తన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని తెలిపాడు.