వామికాతో విరాట్ కోహ్లీ

by Shyam |
Virat kohli
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో దొరికిన సెలవులను కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. కూతురు వామిక పుట్టి ఆరు నెలలు పూర్తి కావడంతో కేక్ కోసి వేడుక చేసుకున్నాడు. భార్య అనుష్క, కొహ్లీ కలసి వామికాతో సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వామికా ఫొటోలు నేరుగా పెట్టకుండా వెనుక వైపు నుంచి కనిపించేలా షేర్ చేశారు. తన కూతురికి సోషల్ మీడియా పట్ల అవగాహన వచ్చే వరకు తాను మొఖాన్ని చూపించనంటూ గతంలోనే కోహ్లీ చెప్పాడు.

Vamika

తాజాగా వామికతో దిగిన ఫొటోలు పెట్టిన అనుష్క ఉద్వేగభరితమైన సందేశాన్ని ఉంచింది. ‘ఆమె విసిరే నవ్వు మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఒ చిన్నారి తల్లీ.. నీ ప్రేమకోసమే మేమిద్దరం బతుకుతున్నాం. మన ముగ్గురికీ హ్యాపీ 6 మంత్స్’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed