ఒకే ఫ్రేమ్‌లో ‘ప్రేమమ్’ బ్యూటీస్

by Shyam |   ( Updated:2020-10-18 05:19:27.0  )
ఒకే ఫ్రేమ్‌లో ‘ప్రేమమ్’ బ్యూటీస్
X

దిశ, వెబ్‌డెస్క్ :‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరపై వికసించి, తన నవ్వులతో ప్రేక్షకులకు నిద్రపట్టకుండా చేసిన బ్యూటీ సాయిపల్లవి. తొలి సినిమాలో తన పాత్ర పేరు కూడా ‘మలర్’(పువ్వు) అని ఊహించి పెట్టి ఉంటారు. అంత సహజంగా నటించే ఈ మలర్ బ్యూటీ తొలి సినిమాతోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. అదే సినిమాతో మరో బ్యూటీ కూడా యువతను తనవైపునకు తిప్పుకుంది. మేరీ జార్జ్‌గా తెరపైకి వచ్చిన ‘అనుపమ పరమేశ్వరన్’.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ మంచినటిగా గుర్తింపుతెచ్చుకుంది. ‘ప్రేమమ్’తో కెరీర్‌ మొదలుపెట్టిన వీరిద్దరు కూడా తెలుగు, తమిళ, మళయాళ పరిశ్రమల్లో నటనకు గుర్తింపునిచ్చే పాత్రలను ఎంచుకుంటూ.. కెరీర్‌ను బిల్డప్ చేసుకున్నారు. పక్కింటి పిల్ల తరహా పాత్రల చేయాల్సి వస్తే.. దర్శకుల మదిలో ముందుగా మెదిలే హీరోయిన్లు ఈ ఇద్దరే. అయితే మేరీ, మలర్‌ ఇద్దరూ కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అయితే.. ఇది సినిమా కోసం కాదు. ఫ్రెండ్లీగా కలుసుకున్నారు. ‘సాయి పల్లవి’కి తాను బిగ్ ఫ్యాన్ అంటూ అనుపమ ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంది. అంతేకాదు మేరీ, మలర్‌లు ఎవరికైనా గుర్తున్నారా? అని అనుపమ ప్రశ్నించడంతో పాటు ‘లవ్ యూ సాయిపల్లవి’ అని పోస్ట్ చేసింది. దాంతో అభిమానులు కూడా వాళ్లిద్దరూ మరోసారి తెరపై కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు.

సాయిపల్లవి ‘ఫిదా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ‘ఎంసీఏ’, పడిపడి లేచే మనసు, కణం, ఎన్‌జీకే చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్మకత్వంలో.. నాగ చైతన్యకి జోడీగా ‘లవ్ స్టోరీ’ సినిమాతో పాటు వేణు ఉడుగుల డైరెక్షన్‌లో ‘విరాట పర్వం’ చిత్రంతో బిజీగా ఉంది. ఇక అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో అఆ, ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికి తెలుగులో ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదు.

Advertisement

Next Story

Most Viewed