- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యాంటీ ఇండియన్’కు చిక్కులు.. అలా చేస్తే బ్యాన్ చేయరా?
దిశ, సినిమా : తన యూనిక్ ఫిల్మ్ రివ్యూస్‌తో పాపులర్ అయిన తమిళ్ ఫిల్మ్ జర్నలిస్ట్, తమిళ్ టాకీస్ ఫేమ్ బ్లూ సత్తై మారన్.. ‘యాంటీ ఇండియన్’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు మ్యూజిక్ విభాగాలను కూడా మారన్ హ్యాండిల్ చేస్తుండగా.. మూన్ ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుందనుకున్న ఈ సినిమాను టోటల్‌గా బ్యాన్ చేస్తూ మేకర్స్‌కు షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.
సాధారణంగా అభ్యంతరకర డైలాగ్స్, సీన్స్ మార్చడం లేదా తొలగించడం సెన్సార్ బోర్డు పని. అయితే ‘యాంటీ ఇండియన్’ను మాత్రం పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మూవీ స్టోరీ వల్ల సొసైటీలో ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ తలెత్తుతుందని భావించినపుడు సెన్సార్ బోర్డ్ ఇలాంటి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉండగా.. బాలీవుడ్ మూవీస్ ‘ఉడ్తా పంజాబ్’, ‘పద్మావతి’ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాయి.
మతం, రాజకీయాలతో ముడిపడిన సమకాలీన సమస్యలపై ‘యాంటీ ఇండియన్’ చిత్రం రూపొందుతుండగా.. మూవీ తెరకెక్కిన విధానంపై ప్రశంసలు అందుతున్నాయి. అలాంటి సమయంలో సెన్సార్ బోర్డ్ సినిమాను బ్యాన్ చేయడం పట్ల నిర్మాత అదమ్ బవ స్పందించారు. సెన్సార్ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించిందని, దీన్ని రీకన్సిడర్ చేయాలని అప్పీల్ చేస్తామని తెలిపారు. సినిమాను బ్యాన్ చేసే నిర్ణయాన్ని సెన్సార్ బోర్డు వెనక్కి తీసుకుంటుందని. ‘యాంటీ ఇండియన్’ రిలీజ్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత.