హన్మకొండలో అవినీతి పరునికి సగం గుండు సన్మానం.. గాడిదపై ఊరేగింపు

by Sridhar Babu |   ( Updated:2021-12-09 04:44:13.0  )
Gadidha-Sanmanam
X

దిశ, హన్మకొండ టౌన్: అవినీతి పరులకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని జ్వాల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ అన్నారు. అవినీతి పరుడుకి సన్మానం పేరుతో జ్వాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఓ వ్యక్తికి అరగుండు చేయించి గాడిదపై ఊరేగించారు. డిసెంబ‌రు-9న‌ అంత‌ర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జ్వాల‌, లోక్ స‌త్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో హ‌న్మకొండ‌లో వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే అవినీతి అధికారులములంగా పేదలకు అందకుండా పోతున్నాయన్నారు. అవినీతి అధికారులు దొరికిపోతే అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో తిరిగి పోస్టింగ్ తెచ్చుకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అవినీతి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. కీసర ఎమ్మార్వో రూ. కోటి 12లక్షలు తీసుకున్న సందర్భాలు ఉన్నా నేటికి చర్యలు తీసుకొలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed