- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కిడ్నాప్ చేసింది కానిస్టేబులే!

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా ఆజాద్‌నగర్‌లో కలకలం రేపిన జ్యోతి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. కానిస్టేబుల్ భగిరథాచారితో ఎంగేజ్‌మెంట్ అనంతరం అతడి వ్యవహార శైలి నచ్చక జ్యోతి కుటుంబీకులు సంబంధం వద్దనుకున్నారు. దీంతో అవమాన భారానికి గురైన కానిస్టేబుల్ భగిరథాచారి వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జ్యోతిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఇక సోమవారం ఇంట్లో నుంచి జ్యోతి బయటకు వచ్చింది. అది గమనించిన భగిరథాచారి ఓ కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు.
ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే భగిరథచారిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్యనే ఈ రోజు కిడ్నాపర్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. జ్యోతిని తానే కిడ్నాప్ చేశానని.. సాయంత్రం తనతో పాటు పోలీసుల వద్ద లొంగిపోతానని స్పష్టం చేశాడు. దీంతో కుటుంబీకులకు కాస్తా ఊపిరి పీల్చుకున్నప్పటికీ తమ కూతురిని ఏం చేశాడో అన్న భయంతో ఆందోళనలో చెందుతున్నారు.