- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గద్వాలలో మరో మూడు పాజిటివ్ కేసులు
దిశ, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. తాజాగా శుక్రవారం మరో మూడు కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు ద్రువీకరించారు. వీరిలో ఇద్దరు గద్వాల పట్టణానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు. మరొక్కరు ఇర్కిచెడు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఇంకా పలువురి రిపోర్టులు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ అసుపత్రి నుంచి పారిపోవడంతో గద్వాలలో కలకలం రేపుతోంది. రాజోలి మండలానికి చెందిన దౌలత్ బీ అనే మహిళకు కరోనా లక్షణాలు ఉండడంతో గురువారం అమెను గద్వాల ఏరియా అసుప్రతికి తరలించారు. అయితే అమె శుక్రవారం ఉదయం సిబ్బంది కళ్ళుగప్పి అసుపత్రి నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని పోలీసులుకు చేరవేశారు. దీంతో అమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గద్వాల్ నుంచి పెద్దపల్లి, అమరవాయ్ మీదుగా మల్దకల్‌కు నడుచుకుంటూ వచ్చిన సదరు మహిళను పోలీసులు పట్టుకుని తిరిగి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: carona, gadwal, positive case, ts news