- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్భయ ఘటన రీపీట్.. రాత్రి బాయ్ ఫ్రెండ్ తో వెళ్తున్న యువతిపై గ్యాంగ్ రేప్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో నిర్భయ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే.. అర్ధరాత్రి స్నేహితునితో కలిసి బయటకు వెళ్లిన ఆమెపై కొందరు కామాంధులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి ఎన్నేళ్లు అయినా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. అయితే తాజాగా మరోసారి నిర్భయ ఘటన రీపీట్ అయ్యింది. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఒక యువతిపై ఆరుగురు కామాంధులు సాముహిక అత్యచారానికి పాల్పడిన దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో సంచలనం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువతి(27) మైసూర్ నగరంలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతుంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి చాముండి కొండల దిగువన ఉన్న లలితాద్రిపుర ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న ఆరుగురు కామాంధులు వారి బండిని అడ్డగించారు. యువతిని బలవంతంగా పక్కకు లాకెళ్లారు. అడ్డొచ్చిన ఆమె ఫ్రెండ్ ని దారుణంగా కొట్టారు. అనంతరం యువతిపై సాముహిక అత్యచారం చేశారు. ఈ విషయం పోలీసులకు చెప్పవద్దని వారిని హెచ్చరించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో ఉన్న ఆమె స్నేహితుడి సాయంతో సమీపంలోని ఆసుపత్రికి చేరుకొని చికిత్స తీసుకొన్నారు. బుధవారం యువతి తనపై జరిగిన అరాచకాన్ని పోలీసులకు తెలిపింది. విషయాన్ని తెలుసుకున్న డీసీపీ ప్రదీప్ గుంటి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న ఆలనహళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.