- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు జిల్లాలో మరో కొత్త మండలం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో మరో నూతన మండలం ఏర్పడింది. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలంలో లో ఉన్న మహమ్మదాబాద్ ను నూతన మండలంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలంలో మహమ్మదాబాద్, సంగాయి పల్లి, అన్నరెడ్డి పల్లి, ముకర్ల బాద్, లింగాయ పల్లి, మంగంపేట్, చౌదర్ పల్లి, గాదిర్యాల్, నంచెర్ల, జులపల్లి గ్రామాలను కలిపి కోతమందలంగా ప్రకటించారు. నవాబ్ పేట మండలం నుండి ఏడు గ్రామాలను తొలగించి వికారాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ చౌడాపూర్ మండలంలో చేర్చారు.
గతంలో జిల్లాల విభజన సమయంలో మాకు వికారాబాద్ జిల్లా కన్న మహబూబ్ నగర్ జిల్లా అయితేనే అనుకూలంగా ఉంటుందని మా గ్రామాలను నవాబ్ పేట మండలంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అప్పట్లో కులక్ చెర్ల మండలంలో ఉన్న కొత్తపల్లి, పురుసం పల్లి, మల్క పూర్,మరికల్, కన్మన్ కల్వ, మోగిల్ల పల్లి, చాకల్ పల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేశారు. దీనితో ఈ గ్రామాలను నవాబ్ పేట మండలంలో చేర్చారు. ఇప్పుడు కొంత మంది నాయకుల ఒత్తిడితో ఈ గ్రామాలను వికారాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన చౌడ పూర్ మండలంలో చేర్చారు.