‘తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది’

by Shyam |   ( Updated:2021-06-19 04:20:08.0  )
bjp leader enugu ravindhar reddy
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ తరహాలో మరో ఉద్యమం మొదలైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరిన తర్వాత మంగళవారం కామారెడ్డికి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్ వద్ద బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సుమారు 300 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఏనుగుకు జేజేలు పలికారు. ఈ సందర్బంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు.

తన అంతం మొదలైందని గ్రహించిన కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఒక్కసారి తాను ఒడిపోయినందుకు తనతో పాటు తన కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ వంద తప్పులను గ్రహించే ఈటల వెంట బీజేపీలోకి వెళ్లామని స్పష్టం చేశారు. రానున్న 2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ లో 9 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రామారెడ్డి ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సదాశివనగర్, తాడ్వాయి మండలాల మీదుగా ఎల్లారెడ్డికి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed