అలర్ట్: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

by Anukaran |   ( Updated:2021-09-11 03:14:15.0  )
అలర్ట్: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సముద్రం మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్ప పీడనం, రానున్న 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్య్సకారులు చేపలు పట్టేందుకు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed