సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్

by vinod kumar |   ( Updated:2020-04-13 00:23:04.0  )
సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం కరోనా సోకిన వ్యక్తిని గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి తోటి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్డీవో, డీఎస్పీ సహా మెడికల్ టీమ్‌లను హుటాహుటిన కంపెనీ వద్దకు పంపించారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వైద్య ఆరోగ్య సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Ttags : corona virus, positive, suryapet, nalgonda, campeny, collector

Advertisement

Next Story