- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో 264 కొత్త కేసులు.. ఇద్దరి మృతి
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, 15,911 శాంపిళ్లను పరీక్షించగా, 264మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో 193 మంది ఏపీ వాసులుండగా, 71మంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులసంఖ్య 6,720కు చేరింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 5,280మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 237మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,203మంది ఉన్నారు.
సోమవారం ఉదయం 9గంటల నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు 81మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,851కి పెరిగింది. వైరస్ బారినపడి కొత్తగా చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 88కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,341 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.