- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకలితో ఉన్న ప్రజల ముందు స్టార్ల విలాసవంతమైన భోజనం..
దిశ, సినిమా : పాండమిక్ టైమ్‌లో స్టార్స్ వెకేషన్ ఫొటోస్ పోస్ట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు ఎదురయ్యాయ్. నవాజుద్దిన్ సిద్ధిఖీ, శ్రుతి హాసన్, శ్రుతి సేత్ లాంటి వారు స్టార్స్ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ అన్నూ కపూర్.. స్టార్స్ వెకేషన్ పోస్ట్‌లపై ఫైర్ అయ్యారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఆకలితో ఉన్న ప్రజల ముందు 56 రకాల విభిన్న వంటకాలతో విందు భోజనం చేసినట్లుగా ఉందని ఫైర్ అయ్యారు.
మీరు రిచ్ అని తెలుసు. ఏదైనా చేయగలరని తెలుసు. మీకు అందమైన శరీరం ఉందని కూడా తెలుసు. అంతకు మించి ఏమి చూపించగలరు? అని ప్రశ్నించాడు. కానీ మీరు ఇలా చేయడం అసలు పద్ధతిగా లేదన్నాడు. దీనినే ‘ఆర్ట్ ఇన్ బ్యాడ్ టేస్ట్’ అంటారని విమర్శించాడు. అయినా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. నెటిజన్లు చూస్తేనే కదా స్టార్స్ అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో నెటిజన్ల తప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డాడు.