- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వినాయక మండపం వద్ద ముస్లిం యువకుడి అన్నదానం
by Sridhar Babu |

X
దిశ, పరిగి : హిందూ ముస్లింలంతా సోదర భావంతో మొలగాలని 8వ వార్డు కౌన్సిలర్ శబనూర్ రియాజ్ పేర్కొన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో భజరంగ్ దళ్ వినాయక ఉత్సవ కమిటీ అధ్వర్యంలో గణనాథుడికి కాలనీ వాసులంతా ప్రత్యేకత పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ముస్లీం యువకుడు శబనూర్ రియాజ్ ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ లాల్కృష్ణ ప్రసాద్, కౌన్సిలర్ జరుపుల శ్రీనివాస్, నాయకులు మల్లేష్, ఆంజనేయులు శ్రీనివాస్, సంతోష్, గుప్త, నర్సింహులు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story